వేంసూరు: రోడ్డుప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం వద్ద శుక్రవారం రోడ్డుప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళుతున్న పాండురంగాచారి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది అడసర్లపాడు గ్రామంగా గుర్తించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పాండురంగాచారి మర్లపాడు ఫౌండ్రిలో పనిచేస్తున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్