వేంసూరుకు చెందిన రైతు చల్లగుండ్ల నాగార్జునరావు (58) విద్యుదాఘాతంతో శుక్రవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 9 గంటల సమయంలో ట్రాక్టర్‌తో పొలం దుక్కుతుండగా నేలపై పడ్డ విద్యుత్ తీగను పక్కకు తొలగించే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.