వేంసూరు మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, జిల్లా ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి ఇటీవల పాము కాటుకు గురై అనారోగ్యం పాలయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నేత దయానంద్, చంద్రశేఖర్ రెడ్డి, ఆనంద్ లు పాల్గొన్నారు.