వేంసూరు: ఏపీ నుంచి ఇసుక తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

ఏపీలో ఉచితంగా సరఫరా చేస్తున్న ఇసుకను తెలంగాణలో అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై వేంసూరు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కడపకు చెందిన పార్థసారధి చౌదరి, కల్లూరు గూడెంకు చెందిన ఆముదాల మధులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ కలిసి కొవ్వూరు నుంచి ఇసుక తరలించి, కల్లూరు గూడెంలో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈదరు విష్ణువర్ధన్ ద్వారా ఇసుక తరలింపు జరిగినట్లు ఎస్ఐ కవిత కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్