తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థికి స్టేట్ ఫస్ట్ మార్క్.

నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు 597 తో వృత్తికా కృష్ణ  విజయకేతనం ఎగురవేశారని తెలంగాణ శ్రీచైతన్య స్కూల్స్ చైర్మన్, డైరెక్టర్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ మరియు శ్రీమతి శ్రీ విద్య తెలిపారు.

అదేవిధంగా 590 ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 70 మంది 580 ఆపైన మార్కులు 35 మంది విద్యార్థులు సాధించారని వారు తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్ సగటు మార్కులు 600 గాను 541 రావటం విశేషం అని తెలిపారు. ఓరల్ పాస్ పర్సంటేజ్ 99.5% మరియు అత్యధిక బ్రాంచ్లు నూరు శాతం ఫలితాలు సాధించారని వారు తెలిపారు. 
అంతేకాకుండా చేసిన జె. ఈ. ఈ. మెయిన్స్ లో కూడా అద్భుత ఫలితాలు సాధించారని, ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ రీసెర్చ్ ఓరియెంటెడ్ టీచింగ్ మెథడాలజీ, ఐ.సి.ఐపిఎల్, సి- ఐపిఎల్ , ఎం. పి. ఎల్,  సి - బ్యాచ్ మరియు టెక్నో వంటి అద్భుతమైన అకాడమిక్ ప్రోగ్రామ్స్ మైక్రో లెవెల్ టీచింగ్ సిస్టం మరియు అంకితభావంతో పనిచేసే అధ్యాపకుల వలన మాత్రమే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని, శ్రీ చైతన్య సాధించిన ఇంతటి ఘన విజయాలకు దరిదాపుల్లో కూడా ఏ విద్య సంస్థ కానీ లేవని వారు తెలియజేసారు.
సబ్జెక్టుల వారిగా నూటికి నూరు శాతం మార్పులు సాధించిన విద్యార్థులు 995 మంది ఉన్నారని తెలిపారు. 
ఇంతటి అనితర సాధ్యమైన విజయానికి కారణమైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఫలితాలు పట్ల విద్యార్థుల తల్లి తండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్