తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణోత్సవాలను నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవి మారుత్ గారు విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం కరస్పాండెంట్ పి. రవిమారుత్ గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణోత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఆనంతదాయకమని రాష్ట్ర అవతరణ అనంతరం కొంత అభివృద్ధిని సాధించిందనీ, ఇంకా ఎంతో సాధించాల్సిన అవసరం ఉందన్నారు. చదువుయొక్క ప్రాధాన్యతను అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్ మోడల్ గా ఉండవలసిన అవసరాన్ని తెలియజేశారు. రేపటి పౌరులైన నేటి విద్యార్థులు సమాజంలో గొప్ప వారిగా తీర్చిదిద్దినప్పుడే ఉపాధ్యాయులుగా విజయం సాధించినట్లేనని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గర్హనీయన్నారు. అలాగే నూతన సంవత్సరం ప్రారంభమవబోతుందని, విద్యార్థులు నూతన విద్యాసంవత్సరానికి సన్నద్ధంగా ఉండాలని, సాంఘీక విషయాల పట్ల అవగాహనను కలిగి ఉంటూ సమాజంలో జరిగే మార్పులను గమనిస్తూ విద్యార్ధి జీవితానికి ఎంతవరకు ఉపయుక్తమో అన్వయించుకుంటూ ముందుకు సాగాలని తెలియజేశారు.
ప్రిన్సిపల్ ఆర్. పార్వతిరెడ్డి గారు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య బలమైన ఆయుధమని, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తూ రేపటి తరానికి ఏవిధంగా తయారు కావాలో చదువుతోపాటు విద్యార్థులలో క్రమశిక్షణ, ఇతర క్రీడానైపుణ్యాలను మెరుగుపరుచుకునేల వారిని ప్రోత్సహించాలని కోరారు. కేవలం ర్యాంకుల మాత్రమే కొలమానం కాదని నర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు తమ వంతు కృషిని విద్యార్థులకు అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వర రావు గారు, కళాశాల డీన్ సోమశేఖర శర్మ గారు, కళాశాల సెంటర్ హెడ్ హేమంత్ గారు, స్ప్రింగ్ లీఫ్ ప్రిన్సిపల్ కేశవ్ గారు, స్నేహ గారు, శ్యామల గారు, జాకీర్ గారు, సెప్ ఇంచార్జ్ ఉమా మహేశ్వర్ రావు గారు, ప్రైమరి ఇంచార్జ్ మానస గారు, స్ప్రింగ్ లీఫ్ ప్రైమరీ ఇంచార్జ్ చందన గారు, ప్రీతీ గారు, టెండర్ రూట్స్ హెచ్.ఎం. అసీమా గారు, ఎకడమిక్ ఇంచార్జ్ ఉషశ్రీ గారు, మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.