SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు శుక్రవారం పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరుకు దరఖాస్తు ఫారాలు అందజేసి, వాటిని సక్రమంగా నింపి గడువులోగా సమర్పించేలా అవగాహన కల్పించాలని ఆయన పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లను కోరారు. ఈ SIR ప్రక్రియను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్