వైరా మున్సిపాలిటీ 12వ వార్డు సత్రం బజారులో ప్రధాన కాలువ చెత్తాచెదారంతో పూడుకుపోయి వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ మాదినేని సునీత వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో జేసీబీ సహాయంతో కాలువలో పూడిక, చెత్తను తొలగించే పనులు చేపట్టారు. దీంతో నీటి ప్రవాహానికి ఇబ్బందులు తొలగనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.