వైరా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సి తాత మధు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 25 నెలల్లో ప్రజలను మోసం చేసి ఎంత బాకీ పడిందో తెలియజేయాలని పువ్వాడ సూచించారు. బీఆర్ఎస్, సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల తరపున పోరాడి హామీలు నెరవేర్చేలా చేస్తామని వారు అన్నారు.