కొనిజర్ల మండలం పెద్ద గోపతి గ్రామంలో నెలకొన్న మిషన్ భగీరథ, తాగునీటి సమస్యపై గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. మిషన్ భగీరథ ఆపరేటర్ల నిర్లక్ష్యం కారణంతో, సకాలంలో ప్రజలకు తాగునీరు అందటం లేదని వివరించారు. ఆపరేటర్లను విధులు నుంచి తొలగించి, నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.