ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో రూ. 1 కోటితో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చొరవతో కౌన్సిలర్ పణితి సైదులు బుధవారం శ్రీకారం చుట్టారు. బుధవారం, సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, కొలతలు సేకరించారు. పనులు నాణ్యతతో, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేలా చేపట్టాలని సూచించారు.