తుమ్మలపల్లిలో మురసు తుఫాన్ బీభత్సం: దెబ్బతిన్న వరి పంటలు

కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలో మురసు తుఫాన్ కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల తీరం దాటిన తుఫాన్ సృష్టించిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి చేతికొచ్చిన వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి. బడిష సైదులుతో సహా పలువురు రైతుల పొలాలు ఈ ప్రకృతి వైపరీత్యానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు ఆశగా సాగు చేసిన పంట నీటిపాలవడంతో మంగళవారం అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕