మాణిక్యారం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ వితరణ

ఖమ్మం జిల్లా, వైరాలోని మాణిక్యారం జెడ్ పీహెచ్ ఎస్ పాఠశాలకు కుంచారపు రవి తన తండ్రి కుంచారపు రంగయ్య జ్ఞాపకార్థం 25 వేల రూపాయల విలువైన వాటర్ ప్యూరిఫైయర్ ను మంగళవారం వితరణగా అందజేశారు. రవి తల్లి కుంచారం నాగలక్ష్మి, సోదరుడు కుంచారపు జగన్నాథం చేతుల మీదుగా ఈ ప్యూరిఫైయర్ ను పాఠశాలకు అందించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ సహాయం చేసిన రవికి ఎంఈఓ జయరాజు, హెచ్ఎం కిషన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, అప్పారావు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕