ఎస్ఐఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

వైరా పట్టణం, పల్లిపాడు గ్రామాలలో జరుగుతున్న ఎస్ఐఆర్ (ఓటరు జాబితా సవరణ) ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, ఆయన ఓటరు జాబితా సవరణ పనులను పరిశీలించి, బూత్ లెవల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్