వైరాలో ఘనంగా దీపావళి వేడుకలు

వైరా పట్టణంలో ఆదివారం దీపావళి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సాయంత్రం ఇళ్ల ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతూ మట్టి ప్రమిదలు వెలిగించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు, యువత టపాసులు కాలుస్తూ సందడి చేశారు. దీపాల వెలుగులతో పట్టణంలోని వీధులు, కాలనీలు కళకళలాడాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మిఠాయిలు పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕