కొణిజర్ల మండల సేవాలాల్ సేన నూతన కమిటీ ఎన్నిక

గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా సేవాలాల్ సేన కొణిజర్ల మండల నూతన కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు భుక్యా నరసింహారావు నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి అభినందించారు. అధ్యక్షుడిగా తేజావత్ సురేష్, ఉపాధ్యక్షుడిగా లకావత్ అర్జున్, ప్రధాన కార్యదర్శిగా భుక్యా సంతోష్ ఎన్నికయ్యారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని నూతన సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ దేవేందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి భుక్యా వినోద్ కుమార్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్