వైరాలో ఎలక్ట్రిషియన్ మృతి: ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నివాళి

ఖమ్మం జిల్లా, వైరాలో ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్న కర్నాటి అవినాష్ రెడ్డి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఆదివారం మృతుడి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శీలం చంద్రశేఖర్ రెడ్డి, చెరుకూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్