ఏన్కూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2024లో జరిగిన గోల్డ్ లోన్ మోసం కేసులో, నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.9 లక్షలకు పైగా రుణాలు పొందిన ముగ్గురు నిందితులు ఇప్పటికే అరెస్ట్ కాగా, పరారీలో ఉన్న ఏ2 శ్రీపాధి మౌనికను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన శ్రీపాది సతీష్, రామచంద్రోజు జయమ్మ, రామచంద్రోజు నరేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ కె. వి. ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును వేగవంతంగా దర్యాప్తు చేపట్టారు.