ఏన్కూర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన సౌకర్యాలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వం ఉచితంగా అందజేసే యూనిఫామ్ లు, నోట్ బుక్స్ పొంది మంచిగా చదువుకోవాలని ఏన్కూర్ తహశీల్దార్ శేషగిరిరావు అన్నారు. శుక్రవారం ఏన్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహశీల్దార్ పాల్గొని విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ లు పంపిణీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్