ఏన్కూర్ మండలంలోని టి. ఎల్. పేట గ్రామంలో గ్లైసిల్, నకిలీ బీటీ పత్తి విత్తనాలపై రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏవో ఎ. నరసింహారావు మాట్లాడుతూ, అక్రమంగా విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూసారాన్ని రక్షించేందుకు పంట అవశేషాలను కాల్చవద్దని, రైతులంతా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో కె. కమలాకర్ పాల్గొన్నారు.