ఏన్కూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ. 9,53,000 రుణాలు పొందిన నలుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. శ్రీపాది సతీష్, మౌనిక (పరారీలో ఉన్నారు), రామచంద్రోజు జయమ్మ, నరేష్ లు కుమ్మక్కై సుమారు 242.25 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఈ మోసానికి పాల్పడ్డారని బ్యాంకు నిర్వాహకులు కె. వి. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆమె వివరించారు.