తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వివిధ రకాల వైరస్ లు, వేరు కుళ్లు, నల్లితో దెబ్బతిన్న మిర్చి పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం ఏన్కూరు మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం దెబ్బతిన్న మిర్చి తోటలను పరిశీలించింది. ఈ పరిశీలనలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.