రెండు రోజులుగా కొనసాగుతున్న చేపల వేట

వైరా రిజర్వాయర్ లో రెండు రోజులుగా మత్స్య కారులు చేపల వేట సాగిస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని తల్లాడ, వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాలకు చెందిన మత్స్య కారులు ఉత్సాహంగా వేటలో పాల్గొంటున్నారు. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామ మత్స్యకారుడు గొడ్ల నాగ బాబు వలకు 20 కిలోల చేప పడింది. ఆ చేపను గ్రామాల ప్రజలు, మత్స్య కారులు ఆసక్తిగా తిలకించారు. అవసరమైన వారు చాపలు కొనుగోలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్