ఖమ్మం జిల్లా, వైరా మండలం గద్దలగూడెం గ్రామంలోని నిమ్మవాగులో వరద ఉధృతి తగ్గడంతో చేపల వేట జోరందుకుంది. నీటి ప్రవాహం తగ్గిన ప్రాంతాల్లో జాలర్లు వలలు విసురుతూ చేపలు పడుతున్నారు. భారీ చేపలు వలలకు చిక్కుతుండటంతో జాలర్లు ఉత్సాహంగా వేట కొనసాగిస్తున్నారు. వలలు విసిరి చేపలను ఒడ్డుకు తీసుకొస్తున్న దృశ్యాలతో వాగు పరిసరాల్లో సందడి నెలకొంది.