ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం భోజ్యతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వారిని పాఠశాల హెచ్ఎం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.