జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని వైరా మండలం ఖానాపురం గ్రామంలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూక్యా బాలాజీ, వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎర్ర మౌలాలి, తాజుద్దీన్, పెంటు, జానీ, సొందు సాహెబ్, బాణోత్ వెంకటేశ్వర్లు, నునావత్ కృష్ణ, నాగిరెడ్డి కృష్ణారెడ్డి, ఖాసిం సాహెబ్, ఆటో నన్నే సాహెబ్, సోడా రఫీ, బాణోత్ కృష్ణ, పోతురాజు శీను తదితరులు పాల్గొన్నారు.