ఖమ్మంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ షురూ

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 28న ప్రారంభమైందని కొణిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చిన్న గోపతి సర్పంచ్ సవళ్ళ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలోని అభ్యర్థులు నవంబర్ 2023 నాటికి డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలని ఆయన సూచించారు. అర్హులైన వారు నవంబర్ 6 లోపు ఆధార్, డిగ్రీ సర్టిఫికేట్ మరియు ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు ఈ గడువును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕