'వైరా రిజర్వాయర్ ఆయకట్టులో సాగునీరు విడుదల చేయాలి'

వైరా రిజర్వాయర్ ఆయకట్టులో రైతుల వరి నాట్లకు సాగునీరు విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కోరారు. ఈ మేరకు శనివారం వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. రిజర్వాయర్లో నీటిమట్టం పూర్తిస్థాయిలో నిండేందుకు సిద్ధంగా ఉండటం వల్ల రైతులకు నీరు విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్