కారేపల్లి: బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

మంగళవారం కారేపల్లి మండలం గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన కునుసోత్ సీతారాములు (45) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇల్లందు వెళ్లి తిరిగి వస్తుండగా, గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తీవ్రమైన వేసవి ఎండల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్