కారేపల్లి: ఈవోపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

భద్రాచలం రామాలయ ఈవో రమాదేవిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కారేపల్లి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మోజు రామమూర్తి, వేములూరి కోటాచారిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ. రామాలయం ఈవోగా రమాదేవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. మహిళా అధికారిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు.

సంబంధిత పోస్ట్