కారేపల్లి: అండర్ టన్నెల్ నిర్మాణం చేపట్టాలి

సీతారామ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా కారేపల్లి మండలంలోని చీమలపాడు, జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గుట్టల్లో అండర్ టన్నెల్ నిర్మాణం చేపట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు బొంతు రాంబాబు, దుగ్గి కృష్ణ ఆదివారం డిమాండ్ చేశారు. చీమలపాడు గుట్టల వద్ద జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ, పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకుండా పనులు చేస్తున్నారని, ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేసేందుకు ముగ్గురు మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్