వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ ఆదివారం సింగరేణి మండలంలో పర్యటిస్తారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తలారి చంద్ర ప్రకాష్ తెలిపారు. ఉదయం కారేపల్లిలో ఆయన మాట్లాడుతూ ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ శాకంబరిగా దర్శనం ఇస్తున్నందున, ఎమ్మెల్యే ఆ తల్లిని దర్శించుకుంటారని, అనంతరం పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.