కారేపల్లి: భాగ్యనగర్ తండా ఎంపీటీసీ స్థానాన్ని విభజించాలి

కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా ఎంపీటీసీ స్థానాన్ని 2 స్థానాలుగా విభజించాలని ఎంపీటీసీ రామచందర్, వాంకుడోత్ గాంధీ, రాంబాబు తదితరులు అధికారులను కోరారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో సింగరేణి మండల పరిషత్ అధికారికి వినతిపత్రం అందించారు. గ్రామంలో 7, 000 పైచిలుకు ఓట్లు ఉన్నందున, ఎంపీటీసీ స్థానాన్ని భాగ్యనగర్ 1, 2లుగా విభజించాలని వివరించారు.

సంబంధిత పోస్ట్