ఖమ్మం నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ, ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ పై అమానుషంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగితెలుసుకున్నారు.