తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లాతో పాటు సమీప జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ప్రధాన జలాశయాలు, వాగుల్లో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. పాలేరు, వైరా, లంకసాగర్ ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఆకేరు, మున్నేరు వాగుల్లోనూ నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. పొలిశెట్టిగూడెం, తీర్థాల వద్ద మున్నేరులో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు.