ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో యువకుడి స్పాట్ డెడ్

ఖమ్మం-వైరా హైవేపై తనికెళ్ళ గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఫణీందర్ (26) అనే యువకుడు మృతి చెందాడు. భార్య, కూతురితో కలిసి అత్తారింటికి వచ్చి తిరిగి వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఫణీందర్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏడాదిన్నర వయసున్న పాపకు తండ్రి, భార్యకు భర్తను కోల్పోవడంతో కుటుంబం అనాథలయ్యింది. భార్య రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.

సంబంధిత పోస్ట్