కొణిజర్లలో అమరవీరుల సభలో వైరా సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి కాశి మాట్లాడుతూ.. బీజేపీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతోందని గురువారం విమర్శించారు. 3200 ఎకరాల అడవిని ఆదానీకి అప్పగించేందుకు ఆదివాసీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు లింగన్న స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు.