కొణిజర్లలోని యూరియా పంపిణీ కేంద్రాలను సీపీ సునీల్ దత్ సోమవారం సందర్శించారు. పంపిణీ సజావుగా జరిగేలా పీఏసీఎస్ సిబ్బంది, వ్యవసాయ అధికారి, ఎస్హెచ్వో, రైతులతో ఆయన నేరుగా మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారని, పుకార్లను నమ్మవద్దని, తగినంత యూరియా ఉందని, నిబంధనల ప్రకారం పంపిణీ జరుగుతోందని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులకు పట్టా పాస్‌బుక్, ఆధార్ ఆధారంగా కూపన్లు జారీ చేస్తారని తెలిపారు.