కొణిజర్ల మండలం గోపారం గ్రామ సమీపంలో ఆటో డ్రైవర్ భిక్షం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు చింతకాని మండలం నాగిలిగొండ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి ఒంటి మీద గాయాలు ఉండటంతో హత్యగా అనుమానించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.