కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలోని పగిడేరు వాగుపై నిర్మాణంలో ఉన్న లోలెవెల్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ శనివారం రైతులతో కలిసి పరిశీలించారు. పనులు నిలిచిపోవడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని, అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రజా ఉపయోగకరమైన బ్రిడ్జి పనులకు ఆటంకపరచడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.