కొణిజర్ల మండలం అంజాపురం గ్రామంలో గోద్రెజ్ సంస్థ ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 10:30 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ పాల్గొంటారు. రైతులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అధికారులు కోరారు.