వైరా మున్సిపాలిటీలో నిధుల స్వాహా... ఇద్దరిపై కేసు

వైరా మున్సిపాలిటీలో నాలుగు నెలల క్రితం జూనియర్ అకౌంటెంట్ ఐతరాజు వెంకటేశ్వరరావు తన పేరిట 28 చెక్కులు రాసుకుని రూ. 52 లక్షల నిధులను మళ్లించిన వ్యవహారంలో అధికారులు చర్యలు చేపట్టారు. అప్పట్లోనే విచారణ చేపట్టి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. అనంతరం, మరింత లోతుగా విచారించిన అధికారులు, వెంకటేశ్వరరావుతో పాటు అప్పటి కమిషనర్ చింతా వేణుపై కూడా క్రిమినల్ చర్యలకు సిఫారసు చేశారు. ఈ ఉత్తర్వులు శుక్రవారం వైరా మున్సిపాలిటీకి అందాయి. దీంతో ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్