గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీ 9వ వార్డులో గురువారం జరిగిన వినాయక నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ కొమ్ముడప్పు వాయిద్యాల నడుమ గిరిజనులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. గిరిజనుల సంప్రదాయ కళలు, సంస్కృతిని ప్రోత్సహిస్తూ వేడుకల్లో పాల్గొనడం ప్రజలను ఆకట్టుకుంది. భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్

✕
✕