వైరా మండలం విప్పలమడక గ్రామ శాఖ అధ్యక్షుడు, గరికపాడు సొసైటీ డైరెక్టర్ దేవభక్తిని అర్జునరావు పార్థివదేహానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ నివాళులర్పించారు. అనంతరం అర్జునరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.