వైరా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సూచన

భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మంగళ వారం సూచించారు. విద్యుత్ స్తంభాలకు ఎర్త్ వల్ల విద్యుత్ సరఫరా అవుతుందని, కావున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు స్తంభాలను ముట్టుకోవద్దన్నారు. అటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేయాలి అన్నారు. అదేవిధంగా వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్