కారేపల్లి మండలంలో సోమవారం ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్ర ప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని జైత్రాంతండా, రేలకాయలపల్లి, పైల్ తండాలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.