వైరాలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో ఏడో వార్డు కౌన్సిలర్ పణితి సైదులు ఆధ్వర్యంలో 100 కేబీ 3 ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. గృహాలకు తక్కువ వోల్టేజ్‌తో కరెంటు వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్న స్థానికుల సమస్యను గుర్తించిన కౌన్సిలర్, ఏడో వార్డుతో పాటు నాలుగో వార్డుకు కలిపి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని కోరగా, అధికారులు స్పందించి దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు కౌన్సిలర్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపా చంద్రకళ, కౌన్సిలర్ పణితి సైదులు, ముళ్లపాటి సీతారాములు, కాపా మురళీకృష్ణ, శ్యాంబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕