ఖమ్మం జిల్లా, వైరా పట్టణంలో 0-5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ కోరారు. వైరా బస్టాండ్, ఇందిరమ్మ కాలనీలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం వైరా మున్సిపాలిటీలో ఘనంగా జరిగింది.