వరి కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయం: రైతు సంఘ నాయకులు

ఖమ్మం జిల్లా, వైరా మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయని రైతు సంఘ నాయకులు బొంతు రాంబాబు తెలిపారు. మండలంలోని దాచాపురం గ్రామంలో సోమవారం పర్యటించి, రైతులు కల్లాలలో వరి ధాన్యం ఆరబెట్టి సుమారు 50 రోజులుగా ఎదురుచూస్తున్నారని, కేంద్రాలు ప్రారంభించి 27 రోజులైనా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. మిల్లర్లు ఖాళీ స్థలం లేకపోతే ప్రభుత్వ కళాశాలలో నిల్వలు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్