రామనరసయ్య నగర్‌కు చెందిన నునావత్ నరేష్ బైక్‌పై శుక్రవారం కొనిజర్ల వెళ్తుండగా బస్వాపురం గ్రామానికి చెందిన మరో బైక్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న స్నేహితులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.